by Suryaa Desk | Sat, Jan 18, 2025, 04:21 PM
విక్టరీ వెంకటేష్ నటించిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్ల రాబడుతోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌కు తెగ నచ్చేయడంతో థియేటర్లకు క్యూ కడుతున్నారు. ఈ నెల 14న మూవీ విడుదల కాగా అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా 5వ రోజుకు 150 కోట్ల మార్క్ దాటేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే నాలుగు రోజుల్లో 131 కోట్ల గ్రాస్ సాధించగా, 4వ రోజు మాత్రమే 25 కోట్లను సంపాదించింది. 5వ రోజు అడ్వాన్స్ బుకింగ్స్ అన్నిచోట్లా చాలా బలంగా ఉన్నాయి.ఉత్తర అమెరికాలో కూడా సంక్రాంతికి వస్తున్నాం అద్భుతమైన ప్రదర్శన చేస్తోంది, త్వరలోనే $1.5 మిలియన్ మార్క్ చేరుకునే అవకాశం ఉంది. అన్ని మార్కెట్లలో బ్రేక్ ఈవన్ పాయింట్‌ను దాటిన ఈ సినిమా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ లాభాలు తెచ్చిపెడుతోంది. వీకెండ్ సమీపించడంతో సంక్రాంతికి వస్తున్నాం ఎలాంటి అవరోధాలు లేకుండా మరింత వేగంగా ముందుకు సాగే అవకాశాలు ఉన్నాయి.
Latest News