by Suryaa Desk | Sat, Jan 18, 2025, 02:16 PM
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై సినీ నటి మాధవీలత 'మా'కు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌కు ఫిర్యాదు చేశారు.ప్రభాకర్ రెడ్డి తన గురించి చేసిన వ్యాఖ్యలపై సినీ పరిశ్రమ స్పందించలేదు కాబట్టే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. ''ప్రభాకర్ రెడ్డి నా గురించి దారుణంగా మాట్లాడారు. సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం సరైనది కాదు. ఆయన క్షమాపణలు చెబితే సరిపోదు. ప్రభాకర్ రెడ్డిపై న్యాయపోరాటం చేస్తాను. ఆయన నాపై చేసిన వ్యాఖ్యలను సినీ పరిశ్రమ ఖండించలేదు. అందుకే ఫిల్మ్ ఛాంబర్‌లో ఫిర్యాదు చేస్తున్నాను'' అని తెలిపారు. ఫిర్యాదు చేయడానికి ముందు మాధవీలత తన ఇన్‌స్టాలో 'న్యాయం కోసం నా పోరాటం' అని పోస్ట్ పెట్టారు.డిసెంబరు 31న తాడిపత్రి జేసీ పార్కులో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలపై మాధవీలతతోపాటు, భాజపా నాయకురాలు సాధినేని యామిని చేసిన వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్‌రెడ్డి స్పందిస్తూ అభ్యంతరకరమైన కామెంట్లు చేయడం విమర్శలకు తావుతీసిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నానని, క్షమాపణ కోరుతున్నట్టు జేసీ ఇటీవల పేర్కొన్నారు. ఆవేశంలోనే అలాంటి వ్యాఖ్యలు చేశాను తప్ప.. వారిని కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు.
Latest News