by Suryaa Desk | Sat, Jan 18, 2025, 03:30 PM
ఈ ఏడాదిలో మన తెలుగు సినిమా నుంచి రిలీజ్ కి రానున్న అవైటెడ్ చిత్రాల్లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు” కూడా ఒకటి. ఆల్రెడీ మార్చ్ 28కి ఈ సినిమాని మేకర్స్ లాక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాతో పాటుగా మళయాళం నుంచి ఎంపురాన్ అలాగే విజయ్ దేవరకొండ భారీ సినిమా కూడా ఆ సమయానికి లైన్ లో ఉన్నాయి.మరి లేటెస్ట్ గా ఈ రేస్ లో యూత్ స్టార్ నితిన్ జాయిన్ అయ్యాడని చెప్పాలి. నితిన్ అలాగే దర్శకుడు వెంకీ కుడుముల కాంబినేషన్ లో చేస్తున్న అవైటెడ్ సినిమానే “రాబిన్ హుడ్”. గత డిసెంబర్ లోనే రిలీజ్ కావాల్సి ఉన్న ఈ సినిమాని మేకర్స్ వాయిదా వేసి ఇపుడు కొత్త డేట్ అనౌన్స్ చేశారు.దీనితో ఈ సినిమా కూడా మార్చ్ 28న రిలీజ్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేశారు. మరి అదే రోజున నితిన్ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ చేస్తున్న పాన్ ఇండియా సినిమా “హరిహర వీరమల్లు” కూడా ఉంది. మరి తన సినిమాకి పోటీగా ఈ సినిమాని అనౌన్స్ చేయడం ఇపుడు గమనార్హం. మరి ఈ రెండు వస్తాయా లేక ఒకటి ఆగుతుందా అనేది చూడాలి.