by Suryaa Desk | Sat, Jan 18, 2025, 02:26 PM
ధమాకా: టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ నటించిన 'ధమాకా' సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన బ్లాక్ బస్టర్ గా నిలిచింది. త్రినాథరావు నక్కిన దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటించింది. తాజా వార్త ఏమిటంటే, ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ జనవరి 19న ఉదయం 8 గంటలకు స్టార్ మాలో ప్రదర్శించబడుతుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల ధమాకా చిత్రాన్ని నిర్మించారు. భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చారు. ఈ సినిమాలో జయరామ్, సచిన్ ఖేడేకర్, రావు రమేష్, తనికెళ్ల భరణి, హైపర్ ఆది కీలక పాత్రలు పోషించారు.
ఆదికేశవ: మెగా హీరో పంజా వైష్ణవ్ తేజ్ మరియు శ్రీలీల ప్రధాన పాత్రలో నటించిన ఆదికేశవ చిత్రం విడుదల అయ్యి ప్రేక్షకులను ఆకర్షించలేదు. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం జనవరి 19, 2025 మధ్యాహ్నం 4 గంటకు స్టార్ మా ఛానల్ లో ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్‌ను ప్రదర్శించనుంది. శ్రీకాంత్ ఎన్. రెడ్డి దర్శకత్వం వహించిన ఆదికేశవలో జోజు జార్జ్, అపర్ణా దాస్, సదా, సుమన్, రాధికా శరత్‌కుమార్ మరియు ఇతరులు ముఖ్యమైన పాత్రల్లో నటిస్తున్నారు. జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందించారు. ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మించాయి.
లక్కీ బాస్కర్: మాలీవుడ్ స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్ యొక్క తెలుగు చిత్రం లక్కీ బాస్కర్ అక్టోబర్ 31, 2024న బహుళ భాషల్లో విడుదలైంది మరియు విమర్శకులు మరియు ప్రేక్షకుల నుండి సానుకూల స్పందనను అందుకుంది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన క్రైమ్ డ్రామా 100 కోట్లు వాసులు చేసింది. ఈ సినిమా యొక్క తెలుగు వెర్షన్ శాటిలైట్ రైట్స్ ని స్టార్ మా ఛానల్ సొంతం చేసుకుంది. తాజాగా ఇప్పుడు ఈ సినిమా స్టార్ మా ఛానల్ లో జనవరి 19న సాయంత్రం 6 గంటలకి స్మాల్ స్క్రీన్ పై ఎంట్రీ ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నట్లు ఛానల్ ప్రకటించింది. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. ఈ చిత్రంలో రామ్‌కి, మానస చౌదరి, హైపర్ ఆది, సూర్య శ్రీనివాస్, రిత్విక్, సచిన్ ఖేడేకర్ మరియు పి. సాయి కుమార్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. శ్రీకరా స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ మరియు ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించారు.
Latest News