by Suryaa Desk | Mon, Jan 20, 2025, 02:42 PM
ఎలాంటి సినీ నేపథ్యం లేకపోయినా అలాగే ఎలాంటి గ్లామర్ షో చేయకుండా లిప్ లాక్ సన్నివేశాలలో నటించకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సక్సెస్ సాధించడం అంటే మామూలు విషయం కాదు.ఇలాంటి విషయాన్నీ కూడా సుసాధ్యం చేసిన వారు అతి తక్కువ మంది ఉన్నారు అలాంటి వారిలో సాయి పల్లవి కూడా ఒకరు. అప్పట్లో సావిత్రి సౌందర్య స్నేహ వంటి వారు ఎక్కడ గ్లామర్ షో చేయకుండా ఇండస్ట్రీలో సక్సెస్ అందుకున్నారు.ఇక వీరి తర్వాత అంతటి నటన నైపుణ్యం ఉన్నటువంటి వారిలో సాయి పల్లవి ఒకరని చెప్పాలి. ఈమె కూడా ఇలాంటి గ్లామర్ షో చేయకుండా కథా ప్రాధాన్యత ఉన్న సినిమాలలో నటిస్తూ సక్సెస్ అందుకున్నారు. ప్రస్తుతం సౌత్ సినిమాలతో పాటు బాలీవుడ్ సినిమాలలో కూడా నటిస్తూ కెరియర్ పట్ల ఎంతో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవి తన కెరియర్ గురించి పలు విషయాలు బయట పెట్టారు.ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె మాట్లాడుతూ..ఎవరికైనా సాయం చేసే స్థాయికి నా దగ్గర డబ్బుంది. ఇదే నాకు దక్కిన ఆశీర్వాదం అనుకుంటున్నా అన్నారు సాయి పల్లవి. సాయి పల్లవి ఆస్తుల విలువ దాదాపు 47 కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా. ఇలా తనకు మరింత ఎక్కువ డబ్బు సంపాదించే అవకాశం ఉన్న ఎప్పటికీ కూడా తన విలువలను వదిలిపెట్టనని సాయి పల్లవి భీష్మించుకొని కూర్చున్నారు.
తాను ఒక సినిమాకు కమిట్ అవుతున్నారు అంటే అందులో ఎలాంటి గ్లామర్ షో ఉండదు అలాగే ఆ సినిమాలో తన పాత్రకు ఎంతో ప్రాధాన్యత ఉంటే తప్ప ఆమె కమిట్ అవ్వరు. తన పాత్రకు ప్రాధాన్యత లేకపోతే స్టార్ హీరో అయిన కోట్లలో రెమ్యూనరేషన్ అయిన సాయి పల్లవి నిర్మొహమాటంగా సినిమాని ఒప్పుకోరు. ఇలా చాలా ఎంపికగా సినిమాలు చేసుకుంటూ సక్సెస్ అందుకున్న ఈమె తన వద్ద సహాయం చేసే అంత డబ్బు ఉందని చెప్పడంతో ఆ డబ్బుతో ఈమె సహాయం చేయడానికి సిద్ధమయ్యారా ఏదైనా పేదలకు సహాయం అందించబోతున్నారా అనే సందేహాలు కలుగుతున్నాయి.
Latest News