by Suryaa Desk | Sun, Jan 19, 2025, 05:39 PM
కోలీవుడ్ హీరో విశాల్ ఆరోగ్యంలో భారీ మార్పులు జరిగాయి. ఇటీవలే ఆయన 'మదగదరాజా' మూవీ ఈవెంట్ లో నిలబడలేని స్థితిలో వణుకుతూ కనపడ్డారు. అనంతరం చెన్నై అపోలో హాస్పిటల్ లో చికిత్స పొందాడు. తాజాగా జరిగిన ఓ ఈవెంట్ లో కనిపించి అందరిని ఆశ్చర్యపరిచాడు. విశాల్ ని చూసిన అందరు ఆశ్చర్యపోయారు. ఎవరు ఊహించని విధంగా విశాల్ ఏం చేశాడంటే..విశాల్ 11 ఏళ్ల క్రితం మొదలు పెట్టిన ‘మదగజరాజా’ సినిమా ఇటీవలే రిలీజై మంచి ఆదరణ పొందుతుంది. సుందర్. సి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ప్రముఖ నటుడు, మ్యూజిషియన్ విజయ్ ఆంటోని సంగీతం నడిచాడు. కాగా ఈ సినిమాలో విశాల్ తో ‘మై డియర్ లవర్’ అనే పాటను కూడా పాడించాడు విజయ్ ఆంటోని. అయితే ఈ సినిమా రిలీజ్ కు ముందు జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విశాల్ తీవ్ర అనారోగ్యంతో కనిపించాడు. స్టేజ్ పై మాట్లాడలేని స్థితిలో వణుకుతూ కనిపించారు. నిర్వాహకులు కూడా ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆయన శరీర ఆకృతిలో కూడా భారీ మార్పులు కనిపించాయి. డాక్టర్లు వైరల్ ఫివర్ అని చెప్పారు. ఇదంతా పక్కనే పెడితే.. తాజాగా ఆయన విశాల్ హాల్ చల్ చేశాడు. ఇంతలోనే అంతా మార్పు అంటూ అందరు ఆశ్చర్యపోయారు. అందరు ఆశ్చర్యపోయేలా విశాల్ ఏం చేశాడంటే..‘మదగజరాజా’ సూపర్ సక్సెస్ కావడంతో మూవీ యూనిట్ అంత సంబరాలు జరుపుకున్నారు. ఈ క్రమంలోనే విశాల్ కూడా హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు. మూవీ టీమ్ చెన్నైలో ఒక మ్యూజిక్ కాన్సర్ట్ నిర్వహించారు. దీనికి హాజరైన విశాల్ ఎంతో హుషారు తో వేదికపై పాడుతూ, డాన్స్ చేశాడు. ఇది చూసిన అందరు.. తక్కువ సమయంలో విశాల్ కోలుకోవడం, మళ్ళి హుషారుగా కనిపించడంతో ఫుల్ ఖుషి అయిపోతున్నారు.
Latest News