by Suryaa Desk | Tue, Jan 21, 2025, 11:48 AM
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా, అమితాబ్ బచ్చన్, దీపిక పదుకొనే ప్రధాన పాత్రలు పోషించిన భారీ పాన్ ఇండియా మూవీ 'కల్కి 2898 ఏడీ'. గత ఏడాది రిలీజ్ అయిన ఈ సినిమా 2024లోనే బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఇక దీనికి సీక్వెల్ కూడా ఉంటుందని ఆల్రెడీ మేకర్స్ అనౌన్స్ చేశారు. అయితే ప్రస్తుతం ప్రభాస్ చేతిలో చాలా సినిమాలు ఉండడంతో, అసలు ఏ సినిమా ముందు సెట్ పైకి వెళ్ళబోతోంది అన్న విషయంలో గందరగోళం నెలకొంది. కానీ ప్రభాస్ మాత్రం కూల్ గా ఒక దాని తర్వాత ఒక సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా 'కల్కి 2898 ఏడీ' నిర్మాత అశ్వని దత్ ఓ ఇంటర్వ్యూలో సీక్వెల్ ఎప్పుడు మొదలు కాబోతోంది అనే విషయంపై అప్డేట్ ఇచ్చారు. "జూన్ లో 'కల్కి 2898 ఏడి' సీక్వెల్ షూటింగ్ సెట్స్ పైకి వెళ్ళబోతోంది" అని ఆయన స్వయంగా వెల్లడించిన వీడియో వైరల్ అవుతుంది.
Latest News