by Suryaa Desk | Fri, Jan 24, 2025, 12:56 PM
అక్కినేని అఖిల్, జైనబ్ ఇటీవల పెళ్లి చేసుకోనున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఈ పెళ్లిని అన్నపూర్ణ స్టూడియోలోనే నిర్వహించనున్నట్లు సమాచారం. నాగ చైతన్య, శోభిత పెళ్లి కూడా ఇక్కడే జరిగింది. దీంతో అఖిల్ పెళ్లి కూడా స్టూడియోలోనే నిర్వహించనున్నారట. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రముఖులు పాల్గొననున్నట్లు తెలుస్తోంది. కాగా అఖిల్ ఏజెంట్ మూవీ తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నారు.అఖిల్-జైనల్‌ల వివాహం ఘనంగా చేసేందుకు ఇరు కుటుంబ సభ్యులు ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. ఈ వివాహ వేడుకకు ఎంతో మంది ప్రముఖులు రానున్నారని అంటున్నారు. ఇక ఈ వార్తలు వైరల్ అవ్వడంతో అక్కినేని అభిమానులు తెగ ఖుషీ అవుతున్నారు. అయితే ఆ పెళ్లి ఎక్కడ ఏ ప్లేస్‌లో జరగనుందో అని అభిమానుల్లో ఆసక్తి పెరిగిపోయింది. అఖిల్ తన అన్నయ్య నాగచైతన్య లాగా ఇండియాలో చేసుకుంటారా లేక డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకుంటారా? అనే దానిపై ఆసక్తి పెరిగింది.
Latest News