by Suryaa Desk | Wed, Jan 22, 2025, 03:54 PM
సూపర్ స్టార్ మహేష్ బాబు తన సతీమణి నమ్రతకు స్పెషల్‌గా బర్త్ డే విషెస్ తెలిపారు. నమ్రత పుట్టిన రోజు (జనవరి 22) సందర్భంగా మహేష్ బాబు తాజాగా ఓ పోస్ట్ వేశాడు. అసలే ఇప్పుడు ఈ ఫ్యామిలీ వెకేషన్‌లో ఉన్నట్టుగా కనిపిస్తోంది. నమ్రత ఫోటోను షేర్ చేస్తూ మహేష్ వేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ప్రతీ రోజు మా జీవితాల్ని మరింత గొప్పగా,వెలిగేలా చేస్తున్నావ్.. నువ్వు అద్భుతమైన మహిళవి అంటూ భార్యపైన ప్రేమను కురిపించాడు మహేష్ బాబు. ప్రస్తుతం నమ్రతకు ఘట్టమనేని అభిమానులు విషెస్ చెబుతున్నారు. నమ్రత, మహేష్ బాబు జోడికి, వారి ప్లానింగ్‌కు అంతా ఫిదా అవుతుంటారు. మహేష్ బాబు తన బిజినెస్ లెక్కల్ని, ప్లానింగ్స్‌ని పట్టించుకోడన్న సంగతి తెలిసిందే. అన్నీ కూడా నమ్రతే దగ్గరుండి మరీ చూసుకుంటూ ఉంటుంది. మహేష్ బాబు కేవలం యాక్టింగ్ మీద మాత్రమే ఫోకస్ పెడుతుంటాడు. మిగిలిన వ్యవహారాలన్నీ కూడా నమ్రత చక్కబెడుతుంటారు. పిల్లల విషయాల్ని కూడా నమ్రతే హ్యాండిల్ చేస్తుంటారు.మహేష్ రాజమౌళి ప్రాజెక్ట్ కోసం ప్రియాంక హాలీవుడ్ నుంచి ఇక్కడకు వచ్చింది. రీసెంట్‌గానే ఆమె హైద్రాబాద్‌లో ల్యాండ్ అయింది. చిలుకూరు బాలాజీ టెంపుల్‌లో ప్రియాంక చోప్రా సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇంకా కొన్ని రోజులు ప్రియాంక చోప్రా ఇక్కడే ఉండబోతోంది. హాలీవుడ్ మార్కెట్ కోసం జక్కన్న ఆమెను తీసుకుని ఉంటాడని అంతా అనుకుంటున్నారు. ఇక మహేష్, ప్రియాంక జోడిని తెరపై రాజమౌళి ఎలా చూపిస్తాడో అని అంతా వెయిట్ చేస్తున్నారు.