by Suryaa Desk | Wed, Jan 22, 2025, 03:42 PM
జనవరి 24 నుంచి వరల్డ్ పికెల్ బాల్ లీగ్ ప్రారంభం కానుంది. ఈ లీగ్‌లో పాల్గొనే తన జట్టు చెన్నై సూపర్ ఛాంప్స్‌కు సంబంధించిన కొత్త జెర్సీని స్టార్ హీరోయిన్ సమంత లాంఛ్ చేసింది. వరల్డ్ పికిల్ బాల్ లీగ్‌లో చెన్నై సూపర్ ఛాంప్స్ ఫ్రాంఛైజీని హీరోయిన్ సమంత కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. రెడ్, ఎల్లో కలర్ కాంబినేషన్‌లో ఈ జెర్సీని డిజైన్ చేశారు. ఇక, ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పోటీ పడనున్నాయి.వరల్డ్ పికిల్ బాల్ లీగ్ లో చెన్నై సూపర్ ఛాంప్స్ ఫ్రాంఛైజీని హీరోయిన్ సమంత కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఆ జట్టుకు యజమానిగా వ్యవహరిస్తోంది. సామ్ కొనుగోలు చేయడంతోనే ఈ గేమ్ ఇక్కడ చాలా మందికి పరిచయమైంది. అయితే తాజాగా ఆమె తన జట్టుకు సంబంధించిన కొత్త జెర్సీని లాంఛ్ చేసింది. చెన్నైలోని సత్యభామ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ స్టిట్యూట్ లో స్పెషల్ ఈవెంట్ ను నిర్వహించి ఈ జెర్సీని విడుదల చేసింది. రెడ్, ఎల్లో కలర్ కాంబినేషన్ లో ఈ జెర్సీని డిజైన్ చేశారు.
Latest News