by Suryaa Desk | Fri, Jan 24, 2025, 08:32 PM
యశ్ హీరోగా మలయాళ దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ‘టాక్సిక్’ను తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో కీలకపాత్రలు పోషించనున్నారంటూ ఎంతో మంది కథానాయికల పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ప్రాజెక్టులో నయనతార భాగమైనట్లు బాలీవుడ్ నటుడు అక్షయ్ ఒబెరాయ్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు.‘‘ప్రస్తుతం నేను రాకింగ్ స్టార్ యశ్ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నా. దీనిలో నయనతార కూడా భాగమయ్యారు. ఇంతకు మించి వివరాలను నేను ఇప్పుడే వెల్లడించకూడదు. త్వరలోనే గీతూ మోహన్ దాస్ ఓ ప్రకటన చేస్తారు. అప్పటి వరకు వేచిచూడండి’’ అని అక్షయ్ అన్నారు. నయనతార ఏ పాత్రలో కనిపించనున్నారనే దానిపై స్పష్టత లేదు. ఇక ఇందులో బాలీవుడ్ నటి కరీనాకపూర్ కూడా నటించునున్నట్లు తొలుత వార్తలు వచ్చాయి. అయితే వీటిపై గతంలో టీమ్ స్పందిస్తూ అధికారిక సమాచారం కోసం వేచి ఉండాలని కోరింది.
Latest News