by Suryaa Desk | Wed, Jan 22, 2025, 02:33 PM
ప్రఖ్యాత నటి వేదిక రచయిత్రి-దర్శకురాలు హరిత గోగినేని దర్శకత్వంలో మహిళా-కేంద్రీకృత హారర్ థ్రిల్లర్ "ఫియర్"లో కనిపించింది. ఈ సినిమా యొక్క తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ, మలయాళంలో విడుదల అయ్యి మిశ్రమ సమీక్షలని అందుకుంది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ చిత్రం డిజిటల్ ప్రసారానికి అందుబాటులోకి వచ్చినట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు స్ట్రీమింగ్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో అరవింద్ కృష్ణ, సాయాజీ షిండే, సాహితి కీలక పాత్రలలో నటిస్తున్నారు. ప్రతిష్టాత్మకమైన దత్తాత్రేయ మీడియా బ్యానర్‌పై AR అభి మరియు సహనిర్మాత సుజాత రెడ్డి ఈ సినిమాని నిర్మించారు. అనూప్ రూబెన్స్ సంగీతాన్ని సమకూర్చగా, ఆండ్రూ బాబు సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు.
Latest News