by Suryaa Desk | Tue, Jan 21, 2025, 05:32 PM
టాలీవుడ్ మోస్ట్ ట్రెండింగ్ జంట అయిన నరేశ్-పవిత్ర లోకేష గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు.మళ్లీపెళ్లి సినిమా తో రెండు తెలుగు రాష్ట్రాల్లో అలజడి సృష్టించారు. ఈ సినిమా ఫలితం గురించి పక్కనబెడితే.. వారిద్దరికి మాత్రం మంచి క్రేజ్ తెచ్చిపెట్టింది. ప్రస్తుతం ఈ జంట మరోసారి వైరల్‌గా మారింది. తాజాగా ఓ సినిమా ఈవెంట్‌లో నరేశ్-పవిత్ర లోకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవిత్ర లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పదిమందిలో ఉండే ఎనర్జీ నరేశ్ ఒక్కడిలోనే ఉంటుందని చెప్పారు. ఆయన ఎనర్జీని ఎవరూ మ్యాచ్ చేయలేరు. తట్టుకోలేరు అని అన్నారు.'ఆయనతో నేను పోటీ పడలేను. అలిసిపోయిన నేను చాలాసార్లు ఇక చాలు అంటాను. కానీ ఆయన అలిసిపోడు' అని పవిత్ర లోకేష్ చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. మరోవైపు నరేశ్ కూడా పవిత్ర లోకేష్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడుతూ.. 'నా జీవితంలోకి పవిత్ర వచ్చాక.. లైఫ్ పూర్తిగా మారిపోయింది. నా జీవితమనే టైటానిక్ షిప్ ఒడ్డుకి చేరినట్లు అనిపిస్తోంది. చాలా రిలీఫ్‌గా అనిపించింది. అర్థం చేసుకునే భాగస్వామి ఉంటే ఎంత ఇబ్బందికరమైన జీవితమైనా సాఫీగా సాగించవచ్చు. అలాగే పవిత్ర వచ్చాక నా పరిస్థితి మొత్తం మారిపోయింది' అని నరేశ్ చెప్పుకొచ్చారు.
Latest News