by Suryaa Desk | Wed, Jan 22, 2025, 04:11 PM
విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన సెన్సేషనల్ హిట్ చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం” కోసం అందరికి తెలిసిందే. ఫ్యామిలీ ఆడియెన్స్ బ్రహ్మరథం పడుతున్న ఈ చిత్రం ఆల్రెడీ వెంకీ మామ కెరీర్ లోనే కాకుండా మన సీనియర్ హీరోస్ లో కూడా రికార్డు వసూళ్లు అందుకుంది. అయితే ఈ చిత్రం ఇపుడు 8 రోజుల రన్ ని వరల్డ్ వైడ్ గా కంప్లీట్ చేసుకోగా ఈ 8 రోజులు సాలిడ్ నంబర్లు అందుకుంది.అయితే ఈ 8 రోజుల్లో పిఆర్ నంబర్లు ప్రకారం 218 కోట్ల గ్రాస్ ని అందుకుంది. అలాగే వీక్ డేస్ లోకి వచ్చిన తర్వాత కూడా సినిమా స్ట్రాంగ్ హోల్డ్ ని కనబరుస్తుండగా ఇపుడు మరిన్ని రికార్డు నంబర్స్ నమోదు చేస్తుంది. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం వహించిన ఈ చిత్రం సంక్రాంతి బరిలోనే వచ్చి భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి ఇంకా సూపర్ స్ట్రాంగ్ గా రన్ అవుతుంది.
Latest News