by Suryaa Desk | Wed, Jan 22, 2025, 04:08 PM
టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో నాగ శౌర్య హీరోగా కొంచెం గ్యాప్ తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ గ్యాప్ తర్వాత తాను హీరోగా మరో సినిమా చేస్తున్నట్టుగా రీసెంట్ గానే అనౌన్స్మెంట్ వచ్చింది. మరి ఫైనల్ గా ప్రాజెక్ట్ పై మేకర్స్ టైటిల్ సహా సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ని తన బర్త్ డే కానుకగా రిలీజ్ చేసేసారు.దర్శకుడు రమేష్ దేసిన తెరకెక్కిస్తున్న ఈ చిత్రానికి “బ్యాడ్ బాయ్ కార్తీక్” అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ ని అయితే ఫిక్స్ చేయగా ఇపుడు దీనిపై సాలిడ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా వదిలారు. మరి ఈ పోస్టర్ లో నాగ శౌర్య చేతులకి రక్తం అలాగే నుదుట అదే రక్తంతో అడ్డబొట్టులా కూడా కనిపిస్తుంది.దీనితో ఈ సినిమా సాలిడ్ యాక్షన్ తోనే ఉండేలా ఉందని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తుండగా వైష్ణవి ఫిల్మ్స్ తమ బ్యానర్ లో మొదటి సినిమాగా నిర్మాణం వహిస్తున్నారు.
Latest News