by Suryaa Desk | Wed, Jan 22, 2025, 04:24 PM
బుల్లితెర నటి, టాలీవుడ్ ఫేమస్ యాంకర్ సమీరా షెరీఫ్ మరోసారి తల్లి కాబోతోంది. ఈమె 2019లో అన్వర్ జాన్‌ను పెళ్లి చేసుకుని ఇండస్ట్రీకి దూరం అయింది. 2020లో అర్హాన్ అనే బాబుకు జన్మనిచ్చింది. కాగా ఇప్పుడు మరోసారి తల్లి కాబోతోంది. సమీరా ఆడపిల్ల, అభిషేకం, ముద్దు బిడ్డ, భార్యామణి, మూడు ముళ్ల బంధం వంటి సీరియల్స్‌లో నటించి ఫుల్ క్రేజ్ సంపాదించుకుంది. అంతేకాకుండా పలు చిత్రాల్లోనే నటించి మెప్పించింది.తన కుమారుడు అర్హాన్‌తో ఆడుకునేందుకు త్వరలోనే మరో బుజ్జాయి తమ ఇంట్లోకి రాబోతుందని పేర్కొంది సమీరా. జూలై 4న తనకు డెలివరీ డేట్ ఇచ్చారని కూడా వెల్లడించిందీ యాంకరమ్మ.దీంతో పలువురు బుల్లితెర ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు సమీరా దంపతులకు ముందస్తు అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.కాగా సమీరా గర్భం ధరించడం ఇది నాలుగోసారి. 2019లో అన్వర్ జాన్‌ను పెళ్లి చేసుకున్న ఆమె 2020లో ప్రెగ్నెంట్ అయింది కానీ అబార్షన్ అయ్యింది.రెండోసారి గర్భం దాల్చినప్పుడు అర్హాన్ పుట్టాడు. ఇక 2023లో మూడోసారి సమీరా గర్భం దాల్చగా బిడ్డ ఎదుగుదల ఆగిపోయింది. దీంతో మళ్లీ ఆమెకు నిరాశ తప్పలేదు. ఇప్పుడు మళ్లీ నాలుగోసారి గర్భం ధరించింది సమీరా.ఆడపిల్ల, అభిషేకం, ముద్దు బిడ్డ, భార్యామణి, మూడు ముళ్ల బంధం సీరియల్స్ లో నటించిన సమీర అదిరింది వంటి టీవీ ప్రోగ్రామ్స్ కు యాంకర్ గా వ్యవహరించింది.
Latest News