by Suryaa Desk | Thu, Jan 23, 2025, 03:14 PM
సౌత్ స్టార్ బ్యూటీ నయనతార నటించే సినిమాలకు భాషతో సంబంధం లేకుండా ఆదరణ లభిస్తుంది. ఆమె ఓ సినిమా చేసిందంటే, అది ఖచ్చితంగా సౌత్‌లోని అన్ని భాషల ఆడియెన్స్ చూస్తారు. ఇక ఆమె లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనూ ప్రేక్షకుల్లో సాలిడ్ క్రేజ్‌ను దక్కించుకుంది. అయితే, ఇప్పుడు ఆమె నటిస్తున్న ఓ సినిమా థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీలో రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.శ్రీకాంత్ అనే డైరెక్టర్ తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ థ్రిల్లర్ మూవీ ‘టెస్ట్’ ఇప్పటికే షూటింగ్ పనులు ముగించుకుంది. ఈ సినిమాలో నయనతార లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఆమెతో పాటు మాధవన్, సిద్ధార్థ్, మీరా జాస్మిన్ వంటి స్టార్స్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్ లేకుండా నేరుగా ఓటీటీలో స్ట్రీమింగ్‌కు రానుందట. దీనికి సంబంధించిన ఓ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కూడా త్వరలోనే రానుందని తెలుస్తోంది.శక్తిశ్రీ గోపాలన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా ప్రేక్షకులను ఆద్యంతం ఆకట్టుకునే విధంగా ఉండబోతుందని.. అందుకే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ అయితే బాగుంటుందని మేకర్స్ భావిస్తున్నారట. మరి ఈ మూవీ ఓటీటీ స్ట్రెయిట్ రిలీజ్‌పై క్లారిటీ ఎప్పుడు వస్తుందో చూడాలి.
Latest News