by Suryaa Desk | Tue, Jan 21, 2025, 06:09 PM
టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం శుభవార్త చెప్పారు. తాను తండ్రిని కాబోతున్నట్లు వివరించారు. ఈ విషయాన్ని తెలుపుతూ మంగళవారం ఉదయం పోస్ట్ పెట్టారు. తన సతీమణి రహస్యతో దిగిన స్పెషల్ ఫొటోను అభిమానులతో పంచుకున్నారు. ‘మా ప్రేమ పెరుగుతోంది’ అని ఆ ఫొటోకు క్యాప్షన్ పెట్టారు. ఈ సంతోషకరమైన సమయంలో అందరి ఆశీస్సులు తమకు ఉండాలని కోరుకున్నారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ.. కిరణ్-రహస్య దంపతులకు శుభాకాంక్షలు చెబుతున్నారు.‘రాజావారు.. రాణిగారు’ (2019)తో కిరణ్ తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. అందులో రహస్య హీరోయిన్‌గా నటించారు. ఆ మూవీ షూటింగ్‌లోనే ఇద్దరి మధ్య ఏర్పడిన స్నేహం.. తర్వాత ప్రేమగా మారింది. గతేడాది ఆగస్టులో వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. కుటుంబసభ్యులు, కొద్దిమంది అతిథుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఇక సినిమాల విషయానికొస్తే.. ఇటీవల ‘క’తో కిరణ్ అబ్బవరం సూపర్‌హిట్‌ను అందుకున్నారు.
Latest News