by Suryaa Desk | Tue, Jan 21, 2025, 06:07 PM
నటుడు సైఫ్ అలీఖాన్ తాజాగా డిశ్చార్జ్ అయ్యారు. తన ఇంట్లోకి చొరబడి దుండగుడు దాడి చేయగా నటుడికి గాయాలైన సంగతి తెలిసిందే. ఆరు రోజుల చికిత్స అనంతరం లీలావతి ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారువైద్యులు సైఫ్‌కు వారంపాటు బెడ్‌రెస్ట్ సూచించారు. ఇన్ఫెక్షన్ చేరకుండా ఉండేందుకు కొంతకాలం బయట వ్యక్తులకు దూరంగా ఉండాలని చెప్పినట్టు సమాచారం. అనంతరం సైఫ్ ఇంటికి చేరుకున్నారు. ఆయన వెంట తల్లి, నటి షర్మిలా టాగూర్ ఉన్నారు. సైఫ్ సతీమణి, నటి కరీనా కపూర్, కుమార్తె సారా అలీఖాన్ తదితరులు ఆస్పత్రి నుంచి అంతకు ముందే ఇంటికి వెళ్లారు. సంబంధిత దృశ్యాలను కొందరు ఫోన్లలో చిత్రీకరించి.. సోషల్ మీడియాలో పోస్టు చేశారు. సైఫ్ వేగంగా కోలుకోవడంపై ఆయన సోదరి సబా పటౌడీ ఆనందం వ్యక్తం చేస్తూ డిశ్చార్జ్‌కు ముందు సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. తన సోదరుడితో కలిసి మళ్లీ సమయాన్ని గడపడం సంతోషంగా ఉందన్నారు. గత రెండు రోజులుగా వేగంగా కోలుకున్నాడని తెలిపారు. తన తండ్రి, సోదరుడు క్రికెట్ ఆడే సమయంలో గాయాలైతే వాటిని అలాగే వదిలేసేవారని, తనకు అలా సాధ్యం కాలేదని పేర్కొన్నారు. ఈ మేరకు షేర్ చేసిన ఫొటోలో ఆమె చేతికి బ్యాండేజ్ కనిపించింది. తన వేలికి అయిన గాయాన్ని ఉద్దేశిస్తూ అలా చెప్పారు.ఈ నెల 16న సైఫ్‌పై దాడి జరిగింది. నటుడి వెన్నెముకకు తీవ్రగాయమైంది. సర్జరీ చేసిన వైద్యులు వెన్నెముక నుంచి కత్తిని తొలగించారు. మరోవైపు, ఈ కేసు విషయమై ముమ్మరంగా దర్యాప్తు చేసిన పోలీసులు నిందితుడు మహ్మద్ షరీఫుల్ ఇస్లాం షెహజాద్‌ను అరెస్టు చేశారు. ప్రస్తుతం అతడు కస్టడీలో ఉన్నాడు.
Latest News