by Suryaa Desk | Thu, Jan 23, 2025, 02:25 PM
వరుస ఘన విజయాలతో దూసుకుపోతున్న గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ చిత్రంతో మరో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు.బ్లాక్ బస్టర్ దర్శకుడు బాబీ కొల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ స్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్ తో ‘డాకు మహారాజ్’ను నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ చిత్రంలో బాబీ డియోల్, ప్రగ్యా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు. ‘డాకు మహారాజ్’ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా భారీస్థాయిలో విడుదలైంది. తాజాగా ఈ సక్సెస్ ఈవెంట్ ను గ్రాండ్ గా నిర్వహించారు.
ఈ ఈవెంట్ లో నటి శ్రద్ధా శ్రీనాథ్ మాట్లాడుతూ, “అనంతపురం ప్రజలకు, బాలకృష్ణ గారి అభిమానులకు నా నమస్కారం. అనంతపురంకి మొదటిసారి వచ్చాను. ఇక్కడి మనుషులు చాలా స్వీట్ అని చూస్తుంటునే తెలుస్తుంది. బాలకృష్ణ గారు ఒక మాస్ ఐకాన్, ఒక లెజెండ్. ఆయనతో కలిసి నటించడం గౌరవంగా భావిస్తున్నాను. దర్శకుడు బాబీ గారు ఎంతో ప్రతిభావంతులు. ఆయన దర్శకత్వంలో చేయాలని ఉంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో జెర్సీ తర్వాత డాకు మహారాజ్ లాంటి మరో గొప్ప చేయడం సంతోషంగా ఉంది. ఈ అవకాశమిచ్చిన నాగవంశీ గారికి ధన్యవాదాలు. థమన్ గారు అద్భుతమైన సంగీతం అందించారు. మూవీ టీంలో ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా ఈ కోసం పనిచేశారు. అనంతపురం ప్రజల ప్రేమను మరిచిపోలేను.” అన్నారు.అలాగే నటి ఊర్వశి రౌతేలా మాట్లాడుతూ, “అందరికీ నమస్కారం. డాకు మహారాజ్ చిత్రానికి ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు కృతఙ్ఞతలు. బాబీ గారు కేవలం దర్శకుడు మాత్రమే కాదు, గొప్ప స్టోరీ టెల్లర్. లో ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా మలిచారు. బాలకృష్ణ గారు లాంటి లెజెండ్ తో కలిసి నటించడం గౌరవంగా భావిస్తున్నాను. ఎన్టీఆర్ గారి నట వారసుడిగా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఈ కి బ్యాక్ బోన్ గా నిలిచిన నిర్మాత నాగవంశీ గారికి ధన్యవాదాలు.” అన్నారు.
Latest News