by Suryaa Desk | Thu, Jan 23, 2025, 08:23 PM
తమిళ హీరో శివ కార్తికేయన్, సుధా కొంగర దర్శకత్వంలో ఓ సినిమా రానుంది. ఈ మూవీని 'SK 25' అనే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తున్నారు. కాగా ఈ మూవీ పూజా కార్యక్రమం కూడా ఇటీవల జరిగింది. తాజాగా ఈ సినిమా టైటిల్ ఖరారైనట్లు సినీ వర్గాల్లో టాక్. దీనికి 'పరాశక్తి' అనే టైటిల్ పెట్టినట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో జయం రవి, అథర్వ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఇటీవల విడుదలైన అమరన్‌తో మంచి విజయం అందుకున్నాడు.‘SK-25’ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే పూజా కార్యక్రమం పూర్తి చేసుకోగా.. త్వరలో షూటింగ్ స్టార్ట్ కాబోతుంది. ఇదిలా ఉంటే.. తాజాగా, ‘SK-25’ టైటిల్ ఫిక్స్ అయినట్లు సమాచారం. దీనికి ‘పరాశక్తి’(Parashakti) అనే పవర్ ఫైల్ పేరును కన్ఫార్మ్ చేసినట్లు టాక్. త్వరలోనే ఇందుకు సంబంధించిన టైటిల్ టీజర్‌ను కూడా మేకర్స్ విడుదల చేయనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ విషయం తెలుసుకున్న నెటిజన్లు శివ కార్తికేయన్(Siva Karthikeyan) మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడం ఖాయమని అంటున్నారు.
Latest News