by Suryaa Desk | Wed, Jan 22, 2025, 02:52 PM
కేజీఎఫ్ 1,2 సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన శ్రీనిధి శెట్టి గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. కేజీఎఫ్‌లో తన నటనతో ఈ బ్యూటీ ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. అలాగే తన అందం, అభినయంతో ప్రేక్షకుల్లో మంచి ఫేమ్ తెచ్చుకుంది. దీంతో వరుస ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ యంగ్ హీరో సిద్దు జొన్నలగడ్డ(Sidhu jonnalagadda) సరసన ‘తెలుసు కదా’(Telusu kada) మూవీలో నటిస్తోంది. అలాగే నిత్యం సోషల్ మీడియా(Social media)లో యాక్టీవ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫొటోస్, వ్యక్తిగత విషయాలతో అన అభిమానులకు దగ్గరవుతూ ఉంటుంది.ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్ అవుతోంది. తాజాగా శ్రీనిధి తన ఇన్‌స్టా(Instargam) వేదికగా కొన్ని ఫొటోలు షేర్ చేసింది. అందులో వైట్ డ్రెస్ వేసుకొని పాపిట తిలకం దిద్దుకొని షాకింగ్ లుక్‌లో దర్శనమిచ్చింది. అంతేకాకుండా.. ‘ ప్రతిదానితో నా లవ్ ఎఫైర్.. నాలో భక్తి అనే అగ్నిని పెంచుతోంది’ అనే క్యాప్షన్ జోడించింది. దీంతో ఈ పోస్ట్ కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. పెళ్లి ఎప్పుడు చేసుకున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.