by Suryaa Desk | Fri, Jan 24, 2025, 12:52 PM
టాలీవుడ్ అగ్ర తార.. అందాల ముద్దుగుమ్మ సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. తెలుగు ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన కొద్ది రోజుల్లోనే స్టార్ గుర్తింపు సంపాదించుకుంది. కెరీర్ మొదట్లోనే అగ్ర హీరోల సరసన అవకాశాలు కొట్టేసింది. కోట్లాది మంది అభిమానుల్ని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ కొన్నిడేస్ మయోసైటిస్ వ్యాధితో బాధపడింది. ఈ కారణంగా సంవత్సరం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. తర్వాత సిటాడెల్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చి.. తనదైన సత్తా చాటింది. ప్రస్తుతం వరుస సినిమాలు, వెబ్ సిరీస్‌లతో దూసుకుపోతుంది. సోషల్ మీడియాలో కూడా అభిమానులతో టచ్‌లో ఉంటూ ఫ్యాన్స్‌ను అలరిస్తుంది. తాజాగా ఈ బ్యూటిఫుల్ హీరోయిన్ ఇన్‌స్ట్రాగ్రామ్ వేదికన ఓ పోస్ట్ పెట్టింది. ‘‘ వచ్చే 6 నెలల పాటు నేను నవ్వుతూ ఉంటాను’’ అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. అంతేకాకుండా వైట్ కలర్ టాప్ ధరించి బ్యూటిఫుల్ పిక్స్‌కు ఫోజులిచ్చింది. ఈ పిక్స్ వీక్షించిన సమంత అభిమానులు లవ్‌లీ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం సామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..
Latest News