by Suryaa Desk | Fri, Jan 24, 2025, 03:48 PM
‘అఖండ 2’ మూవీలో సంయుక్తా మీనన్ హీరోయిన్‌గా నటించబోతుందని సమాచారం. సంయుక్తా మీనన్, తెలుగులో ‘భీమ్లా నాయక్’, ‘బింబిసార’, ‘విరూపాక్ష’ సినిమాలతో మంచి సక్సెస్ అందుకుంది. ప్రస్తుతం నిఖిల్ సిద్ధార్థతో ‘స్వయంభు’ సినిమా చేస్తున్న సంయుక్తా మీనన్, శర్వానంద్‌తో ‘నారి నారి నడుమ మురారి’ అనే సినిమాలోనూ నటిస్తోంది. వీటితో పాటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తర్వాతి సినిమాలోనూ హీరోయిన్‌గా సెలక్ట్ అయ్యింది..హిందీలో ఓ సినిమా, మలయాళంలో ఓ సినిమా చేస్తున్న సంయుక్తా మీనన్, ‘అఖండ 2’ మూవీలో హీరోయిన్‌గా కన్ఫార్మ్ అయ్యిందట. ‘అఖండ’ మూవీకి సీక్వెల్ కాబట్టి ప్రగ్యా జైస్వాల్ కూడా కనిపిస్తుందా? లేక పూర్తి కొత్త కథతో ‘అఖండ 2’ తెరకెక్కనుందా? అనే విషయాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.ఇప్పటికే ‘అఖండ 2’ మూవీని సెట్స్ మీదకి తీసుకెళ్లింది చిత్ర యూనిట్. ప్రయాగ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాలో ‘అఖండ 2’ మూవీ కోసం కొన్ని సీన్స్‌ని షూట్ కూడా చేశాడు డైరెక్టర్ బోయపాటి శ్రీను.. ‘అఖండ 2’ చిత్రాన్ని సెప్టెంబర్ 25న రిలీజ్ చేయబోతున్నట్టుగా డేట్ కూడా ఫిక్స్ చేశారు. ఇప్పటికే బోయపాటి శ్రీను - బాలకృష్ణ కాంబినేషన్‌లో వచ్చిన మూడు సినిమాలు సూపర్ హిట్లుగా నిలిచాయి
Latest News