by Suryaa Desk | Sat, Jan 25, 2025, 02:21 PM
ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఇంట్లో ఐటీ దాడుల నేపథ్యంలో అతడి తల్లి అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. తాజాగా ఈ విషయంపై మీడియా ముందు స్పందించారు దిల్ రాజు. ఐటీ దాడులు జరుగుతున్న క్రమంలో నేను అధికారులతో ఉండగా.. ఈ నెల 19న అమ్మకి దగ్గు, జలుబు ఎక్కువయ్యి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది ఉండడంతో ఆసుపత్రికి వెళ్లి ట్రిట్‌మెంట్ తీసుకొని ఇంటికి వచ్చింది. అయితే ఇంటికి వచ్చిన అనంతరం సడన్‌గా దగ్గు ఎక్కువ అవ్వడంతో మళ్లీ వెంటనే ఆసుపత్రికి తరలించాం. కానీ ఈ విషయంలో కొన్ని మీడియా ఛానల్స్ ఆమెకి హార్ట్ ఎటాక్ అని.. ఇంకెదో అని రాశారు. అవేం లేవు. ఆమె ప్రస్తుతం బాగానే ఉంది. ప్రస్తుతం ఆమె వయస్సు 81 ఏండ్లు. రెండు రోజులు ఆసుపత్రిలో ఉంది. ఇప్పుడు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వస్తున్నారు. లంగ్స్ ఇన్ఫెక్షన్ పెరగడం వలన దగ్గు ఎక్కువ అయ్యింది తప్ప ఇంకేం కాలేదు. మీడియాకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్న తప్పుడు వార్తలను ప్రచారం చేయకండి అంటూ దిల్ రాజు తెలిపాడు.
Latest News