by Suryaa Desk | Sat, Jan 25, 2025, 04:15 PM
విక్టరీ వెంకటేష్ హీరోగా ఐశ్వర్య రాజేష్ అలాగే మీనాక్షి చౌదరి హీరోయిన్స్ గా దర్శకుడు అనీల్ రావిపూడి తెరకెక్కించిన క్రేజీ హిట్ చిత్రం “సంక్రాంతికి వస్తున్నాం” కోసం తెలిసిందే. మరి ఫ్యామిలీ ఆడియెన్స్ మన్ననలు పొంది రికార్డు వసూళ్లు ఈ చిత్రం అందుకోగా యూఎస్ మార్కెట్ లో కూడా ర్యాంపేజ్ ఈ చిత్రం చూపిస్తుంది.ఇలా యూఎస్ లో భారీ వసూళ్లతో పాటుగా ఒకో లొకేషన్ నుంచి యావరేజ్ గా హైయెస్ట్ వసూళ్లు అందుకున్న సినిమాగా కూడా ఈ ఏడాదిలో ఇదే నిలిచినట్టుగా చెబుతున్నారు. అంతే కాకుండా ఒక్క నార్త్ అమెరికా నుంచే సంక్రాంతికి వస్తున్నాం రికార్డు మైల్ స్టోన్ మార్క్ 2.5 మిలియన్ డాలర్స్ గ్రాస్ మార్క్ ని అందుకుంది.ఇక నెక్స్ట్ 3 మిలియన్ మార్క్ వైపుగా వెళుతున్నట్టుగా మేకర్స్ కాన్ఫిడెంట్ గా ఉన్నారు. మొత్తానికి మాత్రం సంక్రాంతికి వస్తున్నాం హవా మామూలుగా లేదని చెప్పి తీరాలి. ఇక ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించగా దిల్ రాజు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.
Latest News