by Suryaa Desk | Sat, Jan 25, 2025, 04:13 PM
బుల్లితెర నటి చవీ మిట్టల్ గత కొద్ది కాలంగా రొమ్ము క్యాన్సర్‌తో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఆమె పలు చికిత్సలు తీసుకుంటుంది. ఈ క్రమంలోనే చవీ జుట్టును కోల్పోతుందని బాధపడుతుంది. అవన్నీ పట్టించుకోకుండా కొంతమంది ఆమెను ట్రోల్స్ చేస్తున్నారు. తాజాగా, ఈ విషయాన్ని వెల్లడిస్తూ చవీ తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ‘‘మానవత్వం చచ్చిపోతే ఎలా ఉంటుందో ఈ రోజు నేను మరోసారి చూశానుక్యాన్సర్‌తో బాధపడుతున్న నేను చికిత్స వల్ల జుట్టు కోల్పోతుంటే.. కొందరు నన్ను ట్రోల్ చేస్తున్నారు. 2022 నుంచి రొమ్ము క్యాన్సర్‌తో పోరాడుతున్నాను. దీనికి పదేళ్లపాటు ట్రీట్‌మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ ఏడాది ఏప్రిల్‌తో నా హార్మోన్ చికిత్సకు మూడేళ్లవుతాయి. ఈ ట్రీట్‌మెంట్ వల్ల ఎన్నో దుష్ప్రభావాలున్నాయి. చర్మం పొడిబారడం, డీహైడ్రేషన్ , బరువు సరిగా లేకపోవడం మూడ్ స్వింగ్స్ తిమ్మిర్లు.. ఇలా వీటన్నింటితో పాటు జుట్టు కూడా ఊడిపోతుంది. అమ్మాయిలకు జుట్టు అంటే ఎంత ఇష్టమో నేను మాటల్లో చెప్పలేను.మొదటగా అమ్మతనానికి అవసరమైన రొమ్ము నిలుపుకోవడానికి పోరాడాను. ఇప్పుడు జుట్టు కోసం. ఇలాంటి సమయంలో మీరు చేసే నెగెటివ్ కామెంట్లు నన్ను మరింత కుంగదీస్తున్నాయి. ఇప్పుడు పోస్ట్ పెట్టడానికి కారణం.. కొందరు నన్ను ఇష్టపడి నా అకౌంట్ ఫాలో అవడం లేదు. కేవలం ట్రోల్ చేయడానికే ఫాలో అవుతున్నారు. క్యాన్సర్ వారియర్‌ను ట్రోల్ చేయడానికి మనసెలా అంగీకరించిందో అర్థం కావడం లేదు. తల నిండా వెంట్రుకలు, క్యాన్సర్ లేని నీచమైన విమర్శలు లేని జీవితం ఉండాలని ఆశిస్తున్నా. ఆత్మస్థైర్యాన్ని కోల్పోకుండా కష్టపడి నా శరీరాన్ని ఫిట్‌గా ఎలా ఉంచుకున్నానో చూడండి’’ అని రాసుకొచ్చింది.