by Suryaa Desk | Mon, Jan 27, 2025, 04:18 PM
టీమ్ఇండియా పేసర్ మహ్మద్ సిరాజ్ పెళ్లి వార్తలపై స్పందించాడు. గత రెండు రోజులుగా బాలీవుడ్ మీడియాతో పాటు నెట్టింట కూడా సిరాజ్ పెళ్లి గురించి రూమర్స్ వచ్చాయి. లెజండరీ సింగర్ ఆశా భోస్లే మనవరాలు.. సింగర్ జనై భోస్లే తో కొంత కాలంగా ఆయన ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరిగింది. తాజాగా ముంబయిలోని ఆమె నివాసంలో తన 23వ పుట్టినరోజు వేడుకులను చాలా ఘనంగా జరుపుకుంది. ఈ కార్యక్రమంలో సిరాజ్ కూడా పాల్గొన్నాడు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట భారీగా వైరల్ అయ్యాయి. ఫొటోలో వారిద్దరూ కాస్త సన్నిహితంగా ఉన్నట్లు కనిపించడంతో ఈ పెళ్లి వార్తలు తెరపైకి వచ్చాయి. చాలా కాలంగా వారు డేటింగ్లో ఉన్నారని కూడా పలు హిందీ, తెలుగు వెబ్సైట్లు పేర్కొన్నాయి. మరింత స్పీడ్‌గా ఈ వార్తలు వ్యాప్తి చెందుతుండటంతో సిరాజ్ తాజాగా రియాక్ట్ అయ్యాడు.
Latest News