by Suryaa Desk | Sat, Jan 25, 2025, 04:20 PM
బిగ్‌బాస్ కంటెస్టెంట్ మెహబూబ్ దిల్ సే గురించి ప్రత్యేకంగా చెప్పవల్సిన అవసరం లేదు. ఇటు బుల్లి తెర, అటు సోషల్ మీడియాలో తనకంటూ ఓ ప్రత్యేకం గుర్తింపు సంపాదించుకున్నారు.యూట్యూబ్, టిక్‌టాక్ వీడియోలతో ఫేమస్ అయ్యాడు. సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్స్ గా పాపులరిటీ సొంతం చేసుకున్నారు. ఈ ఫేమ్ తో బిగ్ బాస్ సీజన్ 4, సీజన్ 8 లో పాల్గొని మరింత క్రేజ్ సంపాదించుకున్నారు. ప్రస్తుతం కవర్ సాంగ్స్, వెబ్‌సిరీస్‌లు చేస్తూనే, మరోవైపు సినిమాల్లోనూ నటిస్తున్నాడు. అయితే.. తాజాగా జబర్దస్ బ్యూటీ తో మెహబూబ్ రొమాన్స్ చేస్తూ దొరికిపోయాడు. ఇంతకీ ఆ బ్యూటీ ఎవరు? ఇంతకీ ఆ కథేంటో..?మెహబూబ్ దిల్ సే డ్యాన్సర్. అలాగే ఇన్‌స్టా ఇన్‌ఫ్లూయన్సర్స్ కూడా. బిగ్ బాస్ షోతో ఫేమ్ సంపాదించుకున్న మెహబూబ్ తో రొమాన్స్ చేసిన బ్యూటీ ఎవరో కాదు.. జబర్దస్త్ బ్యూటీ శ్రీ సత్య (satya sri). మోడలింగ్ లో కెరీర్ స్టార్ట్ చేసి ఈ అమ్మడు.. తరువాత సీరియల్స్ లలో నటించే అవకాశాన్ని సొంతం చేసుకుంది. పలు సిరియల్స్ ల్లో నటించి, బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది. ఈ తరంలో జబర్దస్త్ లో చమ్మక్ చంద్ర టీంలో లేడీ కమెడియన్ ఎంట్రీ ఇచ్చింది. జబర్దస్త్ లో ఎంట్రీ ఇచ్చాక తనేంటో నిరూపించుకుంది.
తన కామెడీ టైమింగ్ తో అదరగొట్టింది. మరింత పరిచయాన్ని పెంచుకుని మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాకుండా అభిమానులను కూడా పెంచుకుంది. ఈ అమ్మడు కేవలం సీరియల్స్ టీవీ షోలలోనే కాకుండా.. ప్రవేట్ ఆల్బమ్స్ లలో కూడా అదరగొడుతుంది. అలా తాజాగా బిగ్ బాస్ ఫ్రేమ్ మెహబూబ్ దిల్ సే.. శ్రీ సత్య లు కలిసి ఓ ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్ లో నటించారు. అదే.. 'నువ్వే కావాలి' అనే ప్రవేటు మ్యూజిక్ ఆల్బమ్.'నువ్వే కావాలి' వీడియో సాంగ్ ఇటీవల విడుదలైంది.ఈ సాంగ్ ను సినిమాల్లో పాటలకు ఏ మాత్రం తీసిపోని షూట్ చేశారు. ఇందుకోసం మెహబూబ్, శ్రీ సత్య అండ్ టీమ్ యూరోప్ వెళ్ళింది. పారిస్ వీధుల్లో, ఇంకా అందమైన లొకేషన్లతో పాటు ఈఫిల్ టవర్ ముందు సాంగ్ షూట్ చేశారు. ఈ యూత్ ఫుల్ సాంగ్ 'నువ్వే కావాలి'కి సురేష్ బనిశెట్టి సాహిత్యం అందించారు. డిఓపి,ఎడిటింగ్, డైరెక్షన్ భార్గవ్ రవడ చూసుకున్నారు. ఈ సాంగ్ మనీష్ కుమార్ మ్యూజిక్ అందించగా.. వైషు మాయ, మనీష్ పాడారు. యూరోప్ లోని లోని బార్సిలోన, మెక్సికో, పారిస్ వంటి అద్భుతమైన లొకేషన్స్ లో సాంగ్షూట్ చేశారు. ప్రస్తుతం నువ్వే కావాలి సాంగ్ సోషల్ మీడియాలో వైరలవుతోంది. మీరు కూడా ఓ లూక్కేయండి మరీ.