by Suryaa Desk | Sat, Jan 25, 2025, 04:09 PM
స్టార్ హీరోయిన్ త్రిష తెలుగు, తమిళ, హిందీ భాషల్లో స్టార్ హీరోల సరసన ఎన్నో చిత్రాల్లో నటించి ఫుల్ క్రేజ్‌తో ఇండస్ట్రీలో రాణిస్తుంది. ఇప్పటికీ పెళ్లి చేసుకోకుండా వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోయిన్స్‌కు పోటీగా నిలుస్తోంది. 42 ఏళ్లు వచ్చినప్పటికీ తన అందంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తూ ఆశ్చర్యపరుస్తుంది. ప్రస్తుతం ఈ అమ్మడు మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. అలాగే విజయ్-69, విదాముయార్చి , గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి చిత్రాలతో ఫుల్ బిజీ అయిపోయింది.ఈ క్రమంలో.. త్రిష తాను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తానని కామెంట్స్ చేసి నెట్టింట సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే.. తాజాగా, త్రిష ఓ షాకింగ్ నిర్ణయం తీసుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియా ను షేక్ చేస్తోంది. ఆమె సినిమాలకు గుడ్ బై చెప్పి రాజకీయాల్లోకి వెల్లబోతున్నట్లు టాక్. అంతేకాకుండా త్రిష ఓ పార్టీలో జాయిన్ కాబోతున్నట్లు పుకార్లు షికారు చేస్తున్నాయి. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ విషయం తెలుసుకున్న వారంతా ఆశ్చర్యపోతున్నారు. త్రిష, విజయ్(Vijay) పార్టీలో జాయిన్ అవ్వబోతుందని అభిప్రాయాపడుతున్నారు.
Latest News