by Suryaa Desk | Sat, Jan 25, 2025, 02:54 PM
సిని పరిశ్రమలో నెపోటిజం (బంధు ప్రీతి) ఉందనే విషయాన్ని ఎవరైనా అంగీకరిస్తారు. ఎంతో మంది స్టార్ కిడ్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు. మరికొందరు క్లిక్ కాలేక కనుమరుగయ్యారు. ఇదే అంశంపై టాలీవుడ్ హీరో మంచు విష్ణు మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సినీ పరిశ్రమలో నెపోటిజం ఉందనే విషయాన్ని తాను కూడా అంగీకరిస్తానని విష్ణు తెలిపారు. అయితే నెపోటిజం అనేది కేవలం ఎంట్రీకి మాత్రమే ఉపయోగపడుతుందని చెప్పారు. ట్యాలెంట్ ఉంటేనే జనాలు ఎంకరేజ్ చేస్తారని.లేకపోతే ఇండస్ట్రీలో నిలబడటం చాలా కష్టమని అన్నారు. మన కష్టం మీదే మన కెరీర్ ఆధారపడి ఉంటుందని చెప్పారు. తన తొలి సినిమా ఫ్లాప్ అయినప్పటికీ తనలో ఏదో ట్యాలెంట్ ఉందని ఆడియన్స్ గుర్తించారని.తనను హీరోగా అంగీకరించారని తెలిపారు. అందువల్లే తాను ఇన్నేళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నానని చెప్పారు.సినిమాల విషయానికి వస్తే సొంత బ్యానర్ లో మంచు విష్ణు 'కన్నప్ప' సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో విష్ణు, మోహన్ బాబుతో పాటు పలువురు స్టార్లు నటిస్తున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ఈ సినిమాలో కనిపిస్తారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ లో విడుదల కాబోతోంది.
Latest News