|
|
by Suryaa Desk | Fri, Dec 08, 2023, 11:02 AM
తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ శుక్రవారం భేటీ కానున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో ఆ పార్టీ ఎన్నికల హామీ అయిన మహిళలకు ఉచిత ప్రయాణంపై చర్చించనున్నారు. రేపటి నుంచే ఆర్టీసీ బస్సుల్లో టికెట్ లేకుండా ప్రయాణించే అవకాశం ఉంది. అయితే మహిళలందరికీ ఉంచితం ఉంటుందా లేదా వయస్సు లిమిట్ ఉంటుందా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం.. తెలంగాణలో ఆరు హామీల్లో ఒకటిగా కాంగ్రెస్ ఈ పథకాన్ని ప్రకటించగానే దీనిపై పెద్ద చర్చే జరిగింది. బాగుందని కొందరు, అమలు కాలేదని మరికొందరు, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక చూద్దాం... ఎవరి అభిప్రాయాలు వారు వ్యక్తం చేశారు. చివరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. డిసెంబరు 9 నుంచి ఈ పథకం అమలులోకి వస్తుందని కూడా ప్రకటించడంతో.. టీఎస్‌ఆర్టీసీ అధికారుల్లో టెన్షన్ నెలకొంది.