|
|
by Suryaa Desk | Fri, Dec 08, 2023, 11:11 AM
జ్యోతిరావు ఫూలే ప్రజాభవన్‌లో ప్రజాదర్బార్ కార్యక్రమం జరగనుంది. ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాభవన్‌కు చేరుకున్నారు. ప్రజాదర్బార్‌లో పాల్గొనేందుకు ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. ప్రజాభవన్‌లో సీఎం రేవంత్ రెడ్డి ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించనున్నారు.
నేటి నుంచి ప్రజాదర్బార్ జరగనుంది. ఈరోజు ఉదయం ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఈ ప్రజాదర్బార్‌లో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొంటారు. కాగా, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రజాదర్బార్ తొలి అడుగు అని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతోంది. ఆర్టీసీపైనా సీఎం సమీక్ష నిర్వహించనున్నారు. మహిళలకు ఉచిత ప్రయాణానికి సంబంధించిన మార్గదర్శకాలపై నేడు చర్చించనున్నారు.
కాగా, ఎన్నికల సమయంలో ప్రజా దర్బార్ నిర్వహిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం కరెంటుపై దృష్టి సారించింది. సచివాలయంలో మధ్యాహ్నం విద్యుత్ శాఖపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించనున్నారు. ఈ సమీక్షకు అధికారులు తప్పకుండా హాజరు కావాలని సీఎన్‌డీ ప్రభాకర్‌రావు ఆదేశించారు. విద్యుత్ సంస్థలో రూ.85 వేల కోట్ల అప్పులపై ఆరా తీస్తారు.