|
|
by Suryaa Desk | Fri, Dec 08, 2023, 03:23 PM
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. ఇవాళ సాయంత్రం కేసీఆర్ కు రీప్లేస్ మెంట్ చేస్తారని వెల్లడించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉందని తెలిపారు. కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు వైద్యులు ప్రకటన విడుదల చేస్తారని.. పార్టీ శ్రేణులు, అభిమానులు యశోద ఆసుపత్రికి రావొద్దని కోరారు.
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని యశోద వైద్యులు తెలిపారు. బాత్రూంలో జారిపడడంతో కేసీఆర్ కు గాయమైందన్నారు. ఎడమ తుంటికి ఫ్యాక్చర్ అయ్యిందని, కేసీఆర్ కోలుకోవడానికి 6 నుంచి 8 వారాలు పడుతుందన్నారు. గత అర్దరాత్రి కేసీఆర్ తన ఫాం హౌజ్ బాత్రూంలో జారిపడిన విషయం తెలిసిందే.
మాజీ సీఎం కేసీఆర్ కాలికి గాయం కావడంతో హైదరాబాద్‌లోని సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయనకు ఇవాళ సాయంత్రం హిప్ రీప్లేస్‌మెంట్ సర్జరీ చేయనున్నట్లు వైద్యులు వెల్లడించారు.