రోడ్డు భద్రతే లక్ష్యం.. మల్లాపూర్‌లో 'అరైవ్ అలైవ్' కార్యక్రమం ప్రారంభం
Tue, Jan 13, 2026, 09:43 PM
|
|
by Suryaa Desk | Sat, Dec 09, 2023, 09:57 AM
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం మనూర్ మండలంలోని మంజీరా నది ఒడ్డున బోరంచ శివారులో వెలిసిన నల్ల పోచమ్మ తల్లికి శనివారం అర్చకులు సిద్దయ్య స్వామి స్థిర వాసరే పురస్కరించుకొని ప్రత్యేక పూజలు చేపట్టారు. పంచామృతాలు, పవిత్ర మంజీరా నది జలాలతో అభిషేకం, పుష్పాలు, పట్టు వస్త్రాలు సమర్పించి, ఎర్రటి కుంకుమ తిలకంతో విశేషాలంకరణ చేపట్టారు. అనంతరం అమ్మవారికి ఒడి బియ్యం సమర్పించి, కుంకుమార్చన, మంగళ హారతి ఇచ్చారు.