|
|
by Suryaa Desk | Thu, Dec 19, 2024, 03:06 PM
ఆత్మకూరు మండలంలోని పెంచికలపేట గ్రామంలో ఇటీవలే వివిధ కారణాలతో మృతిచెందిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు రావుల మధుసూదన్,కండగట్ల దామోదర్ కుటుంబాలను పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి గారు బుధవారం ఉదయం పరామర్శించారు.ఈ సందర్భంగా మృతుల చిత్ర పటాలను పూలమాల వేసి నివాళులు అర్పించారు.అనంతరం వారి మృతికి గల కారణాలను కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు.అదేవిధంగా ఆత్మకూరు గ్రామంలో మృతిచెందిన కరివేధ రాంరెడ్డి పార్థీవదేహాన్ని సందర్శించి మాజీ ఎమ్మెల్యే నివాళులు అర్పించారు.
మాజీ ఎమ్మెల్యే గారి వెంట పరామర్శించిన వారిలో మండల బిఆర్ఎస్ మండల అధ్యక్షులు లేతాకుల సంజీవరెడ్డి ప్రధాన కార్యదర్శి బొల్లోజు కుమారస్వామి టిఆర్ఎస్వి నాయకులు హర్షం మధుకర్ తుప్పరి రమేష్ వంగేటి వేణు తదితరులు ఉన్నారు.