|
|
by Suryaa Desk | Fri, Dec 20, 2024, 02:59 PM
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలో ప్రెస్ క్లబ్ లేక తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రింట్ మరియు ఎలెక్ట్రానిక్ మీడియా విలేకరులు.ఏవైనా ప్రెస్ మీట్లు, లేక ఏవైనా యూనియన్ మీటింగులు,విలేకరులు ఎదుర్కుంటున్న సమస్యల గురించి చర్చించుకుందా మంటే సరైన షెల్టర్ లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గతంలో ఎస్పీఎం యాజమాన్యం పట్టణంలోని హనుమాన్ మందిరం పక్కన గల పాత మున్సిపాలిటీ కార్యాలయంలో కొంత భాగం ప్రెస్ క్లబ్ కొరకు కొన్నాళ్ళు కేటాయించింది కానీ కాగజ్ నగర్ విలేకరుల దురదృష్టమో లేక ఇంకేదో ఆ ప్రెస్ క్లబ్ శిథిలావస్థకు చేరడంతో ఎస్పీఎం యాజమాన్యం స్వాధీనం చేసుకుని కూలగొట్టడం జరిగింది.అప్పటి నుండీ విలేకరుల ఐక్యతా లోపమో మరి ఇంకేదైన కారణమో ఇప్పటి వరకు ఏ విలేకరి ప్రెస్ క్లబ్ కొరకు ఆలోచన చేయలేదు.
విలేకరులను సంఘటితం చేయలేక పోయారు కానీ ఈ మధ్య రతన్ అను ఒక యువ విలేకరి ప్రెస్ క్లబ్ రిజిస్ట్రేషన్ చేపించి (రిజిస్టర్డ్ నంబర్ .259.) ప్రెస్ క్లబ్ భవన నిర్మాణం కొరకు విలేకరులను సంఘటితం చేసి ప్రెస్ క్లబ్ కొరకు స్థలము భవన నిర్మాణానికి కావలసిన నిధులను సమకూర్చాలని గురువారం కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్దా శుక్లా కు విలేకరులందరిని తీసుకెళ్లి వినతి పత్రం ఇవ్వగా విలేకరుల సమస్యలు శ్రద్ధగా విన్న సబ్ కలెక్టర్ శ్రద్దా శుక్లా సానుకూలంగా స్పందించి త్వరలో కాగజ్ నగర్లో ప్రెస్ క్లబ్ నిర్మాణానికి కృషి చేస్తానని సానుకూలంగా స్పందించారు.