|
|
by Suryaa Desk | Sat, Dec 21, 2024, 01:05 PM
రైతుబంధు తో సాగు విస్తీర్ణం పెరిగిందంటూ కేటీఆర్ అవాస్తవాలు చెబుతున్నారని.. నల్లగొండ జిల్లా )లో ఒక్క ఎకరా ఆయకట్టు పెరిగినట్లుగా నిరూపిస్తే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి , కేటీఆర్‌కు సవాల్ విసిరారు.రాష్ట్రంలో 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చామని సభలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో 24 గంటల ఉచిత కరెంట్ ఇచ్చామని చెప్పడం పచ్చి అబద్ధమని అన్నారు. రాష్ట్రం అంతటా కేవలం 11 నుంచి 13 గంటలు మాత్రమే ఉచిత విద్యుత్ ఇచ్చారని ఆరోపించారు. ఇప్పటికైనా కేటీఆర్ సభలో నిజాలు మాట్లాడాలంటూ చరుకలంటించారు. రోడ్ల అమ్మకంతో వచ్చిన డబ్బులను రైతుబంధుకు మళ్లించారని మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు.