by Suryaa Desk | Sat, Dec 21, 2024, 02:54 PM
తెలంగాణలోని 194 మోడల్ స్కూళ్లల్లో అడ్మిషన్ల కోసం షెడ్యూల్ విడుదలైంది. 6 నుంచి 10వ తరగతుల్లో ప్రవేశానికి జనవరి 6 నుంచి ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తులు చేసుకోవాలి. ఈ నెల 23న నోటిఫికేషన్ రిలీజ్ కానుంది.
2025 ఏప్రిల్ 13న ఎంట్రన్స్ ఎగ్జామ్ జరగనుంది. 6వ క్లాసులో అన్ని సీట్లకు, 7 నుంచి 10వ తరగతి వరకు ఖాళీలు ఉంటేనే భర్తీ చేస్తారు. SC, ST, BC, దివ్యాంగులు, EWS విద్యార్థులు రూ.125, ఓసీలు రూ.200 చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చు.