![]() |
![]() |
by Suryaa Desk | Sat, Dec 21, 2024, 02:56 PM
లగుచర్ల ఘటనలో అరెస్ట్ అయిన 17 మంది రైతులు సంగారెడ్డి జైలు నుంచి విడుదలయ్యారు. వీరికి బీఆర్‌ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు. గత నెలలో ప్రజాభిప్రాయ సేకరణ కోసం లగచర్ల గ్రామానికి వెళ్లిన జిల్లా కలెక్టర్, ఇతర అధికారులపై రైతులు తిరగబడడం తెలిసిందే.
ఈ ఘటనలో అరెస్ట్ అయిన కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు పలువురు రైతులకు కోర్టు రిమాండ్ విధించగా నేడు నాంపల్లి స్పెషల్ కోర్టు వీరికి బెయిల్ మంజూరు చేసింది.