![]() |
![]() |
by Suryaa Desk | Sat, Dec 21, 2024, 03:00 PM
ఈనెల 28న నల్గొండలో జరిగే టీఎస్ యుటిఎఫ్ రాష్ట్ర మహాసభలకు హాజరు కావలసిందిగా యుటిఎఫ్ మండల శాఖ పిలుపునిచ్చింది. ఈ మేరకు శనివారం జడ్పీహెచ్ఎస్ పడమటి పల్లి గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు చీన్యకు ఆహ్వాన పత్రికను సంఘ ప్రతినిధులు అందజేశారు.
పాఠశాల నుండి ఉపాధ్యాయులు అధిక సంఖ్యలో హాజరై సభను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి గంటల వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.