by Suryaa Desk | Thu, Dec 26, 2024, 04:32 PM
భారతరత్న, మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి 100వ జయంతిని పురస్కరించుకుని వారికి ఘాన నివాళులు అర్పిస్తూ గజ్వేల్ పట్టణంలో వారి విగ్రహానికి భూమి పూజ నిర్వహించుకోవడం జరిగింది. అనంతరం పట్టణ బిజెపి అధ్యక్షుడు మనోహర్ యాదవ్ ఆధ్వర్యంలో గజ్వేల్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారికి పండ్లు మరియు బ్రేడ్లు పంపిణీ చేసిన గజ్వేల్ బిజెపి నాయకులు. పార్టీ కంటే దేశమే ముఖ్యమన్న జాతీయ వాది, మాతృభూమికి తన జీవితాన్ని అంకితం చేసి, దేశాభివృద్ధికి బాటలు పరిచిన నాయకుడు అటల్ బీహార్ వాజ్ పేయి అని అన్నారు.
అటల్ బీహార్ వాజ్ పేయి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తూ గజ్వేల్ జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో రోగులకు బ్రెడ్లు, పండ్లను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచానికి భారత్ శక్తిని చూపించిన మహనీయుడు అటల్ బీహార్ వాజ్ పేయ్ అని తెలిపారు. భారతదేశంలో అటల్ బీహార్ వాజ్ పేయి జన్మదినాన్ని సుపరిపాలన దినోత్సవం గా జరుపుకుంటారని, భారతీయ జనతా పార్టీ మొదటి నాయకుడు అటల్ బీహార్ వాజ్పేయి మూడుసార్లు భారతదేశ అధ్యక్షునిగా పనిచేశారని తెలిపారు. అతని పదవీకాలంలో కిసాన్ క్రెడిట్ కార్డ్, సర్వ శిక్ష అభియాన్, ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన, జాతీయ గ్రామీణ ఆరోగ్య కార్యక్రమాలు జరిగాయని ఈ కార్యక్రమాలతో దేశ ప్రజలకు ఎంతో లబ్ధి చేకూరిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు గురువారెడ్డి, వెంకటరమణ, యెల్లు రాంరెడ్డి నలగామ శ్రీనివాస్, బిజెపి సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు కూడిక్యాల రాములు, బిజెపి సిద్దిపేట జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షులు నత్తి శివకుమార్, గజ్వేల్ పట్టణ బిజెపి అధ్యక్షులు దేవులపల్లి మనోహర్ యాదవ్, మండలాల అధ్యక్షులు అశోక్ గౌడ్, సంపత్ రెడ్డి, ఐలయ్య యాదవ్ బిజెపి నాయకులు ఉప్పల మధుసూదన్, పెండ్యాల శ్రీనివాస్ సుమతి, మార్కంటి ఏగొండ, మాడ్గురి నర్సింహా ముదిరాజ్, నాయిని సందీప్, నాగు ముదిరాజ్, అయిల మహేందర్, చెప్యాల వెంకట్ రెడ్డి, మైస విజయ్, అరవింద్, భాస్కర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, హరి కుమార్, సంఘేం కరుణాకర్, కుంకుమ రాణి, మంతురి మమత, దయాకర్ రెడ్డి, నవీన్ రెడ్డి, స్వామి, తదితరులు పాల్గొన్నారు.