by Suryaa Desk | Thu, Dec 26, 2024, 04:34 PM
మాజీ ప్రధాని అటల్‌బిహారీ వాజ్‌పేయి దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమైనవని బీజేపీ నాయకులు అన్నారు. బుధవారం వాజ్‌పేయి జయంతిని పురస్కరించుకుని మొహినాబాద్ మండల కేంద్రంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు సన్వెల్లి, ప్రభాకర్ రెడ్డి, మోరా నరసింహ రెడ్డి, గున్నాల గోపాల్ రెడ్డి, అత్తపురం శ్రీనివాస్ లు మాట్లాడుతూ.. వాజ్‌పేయి దేశానికి మూడుసార్లు ప్రధాని బాధ్యతలు చేపట్టి నిస్వార్థ రాజకీయ నాయకుడిగా అందరి మన్ననలు పొందిన నేత అని కొనియాడారు.
దేశానికి ఆయన చేసిన సేవలు, దేశాన్ని అగ్రగామిగా నిలిపిన ఆయన పాలనను దేశ ప్రజలు ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటారన్నారు. అనంతరం మండల కేంద్రానికి సమీపంలో ఉన్న భాస్కర్ ఆసుపత్రిలోని పేషెంట్లకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రభాకర్ రెడ్డి, సుధీంద్ర, రాజ మల్లేష్, శ్రీరాములు, తూర్పు మాధవరెడ్డి, దర్గా మహేందర్, లక్ష్మీపతి యాదవ్, మాదాపురం శ్రీకాంత్, అశోక్ యాదవ్, సంగిరి మల్లేష్, మాధవరెడ్డి, రాజిరెడ్డి, కుమ్మరి మహేందర్, ఎల్లేష్, గోపాల్ రెడ్డి, బాలకృష్ణ, కర్ణం సుధాకర్, చెన్నయ్య, విజేందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.