by Suryaa Desk | Thu, Dec 26, 2024, 04:36 PM
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ పట్టణంలో ప్రెస్ క్లబ్ భవనం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న విలేకరులు. ఈ సమస్యను పరిష్క రించేందుకు కొందరు విలేకరులు అందరు విలేకరులను కలుపుకుంటూ పోవాలనే ఉద్దేశంతో ఒక ప్రెస్ క్లబ్ కొరకు ప్రెస్ క్లబ్ రిజిస్ట్రేషన్ చేపించి (NO.259) కాగజ్ నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ద శుక్లాకు ప్రెస్ క్లబ్ కొరకు స్థలం,మరియు భవన నిర్మాణానికి నిధులు సమకూర్చాలని గత వారం విన్న వించగా అందుకు ఆమె సానుకూలంగా స్పందించి భవన నిర్మాణానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
బుధవారం ఎస్పీఎం (జేకే) జనరల్ మేనేజర్ అయిన మద్దుకూరి గిరి ని కలిసి కాగజ్ నగర్లో ప్రింట్ మరియు ఎలెక్ట్రానిక్ మీడియా కొరకు తాత్కాలిక ప్రెస్ క్లబ్ కొరకు ఒక క్వాటర్ అలాట్ చేయాలని ఆయనకు సమస్య విన్నవించగా ఆయన సానుకూలంగా స్పందించి మా యాజమాన్యానికి తెలియజేసి మీ జర్నలిస్టులకు ఒక క్వాటర్ ఇప్పించేందుకు కృషి చేస్తానని తెలిపారు.వినతి పత్రం ఇచ్చిన వారిలో ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు రతన్ తో పాటు ఈర్ల సతీష్,అహ్మద్ పాషా,వొడ్నల వెంకన్న ఉన్నారు.