by Suryaa Desk | Thu, Dec 26, 2024, 04:40 PM
మహబూబాబాద్ జిల్లా, తొర్రూర్ మండలం, అమ్మాపురం గ్రామం లో స్మశానవాటిక అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది.దహన సమస్కారాలు చేయటానికి ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వ నిధులతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి గ్రామం లో ఇటీవల అధికారులు వైకుంఠ దామాలు నిర్మించి చేతులు దులుపుకు న్నారని ప్రజలు ఆరోపించారు. అమ్మాపురం గ్రామ వైకుంఠ దామంలో ప్రజల సౌకర్యార్థం నిర్మించిన రూములు మద్యం, గంజాయి, సిగరెట్స్ తాగటానికి కేంద్రాలుగా మారాయని ప్రజలు అంటున్నారు.
దీనితో పాటు పేకాటరాయులకు సురక్ష కేంద్రాలుగా మరాయని అంటున్నారు.దహన సమస్కారలకై వచ్చిన ప్రజలు స్నానం చేయాలన్న నీటి వసతులు లేవని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.అసాంఘిక కార్యకలాపాలు జరుగుకుండ అధికారులు చూడాలని ప్రజలు సూచించారు..వైకుంఠ దామం లో నీటి సౌకర్యం ఏర్పాటు చేసి, ప్రజలకు అందుబాటులో తేవాలని గ్రామ ప్రజలు అధికారులను కోరుతున్నారు.