by Suryaa Desk | Fri, Dec 27, 2024, 12:04 PM
ఇటీవల కాలంలో బంగారం ధరల్లో భారీగా హెచ్చుతగ్గులు కనిపించాయి. ఇక గత కొన్ని రోజులుగా భారీగా తగ్గిన బంగారం ధర.. గత రెండు రోజులుగా పెరుగుతూ షాక్ ఇస్తోంది.నిన్న అంటే, గురువారం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 71,250 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 77,730గా ఉంది. ఇక నేడు శుక్రవారం 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 71,260లకు చేరుకోగా.. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ. 77,740గా నమోదైంది. ఇక వెండి ధర విషయానికొస్తే.. వాటి ధరలు సైతం పెరిగాయి. శుక్రవారం కిలో వెండి ధర రూ. 91,700గా ఉంది.ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.77,740 కాగా.. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములు రూ.71,260గా ఉంది. విశాఖపట్నం, విజయవాడలోనూ ఇదే ధర కొనసాగుతోంది. అటు దేశ రాజధాని న్యూఢిల్లీలో మాత్రం 24 క్యారెట్ల పసిడి ధర రూ.77890 ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ. 71,410గా ఉంది.వెండి ధరలు విషయానికొస్తే.. హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలో కిలో వెండి రూ. 1,00,100 ఉండగా.. ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, బెంగళూరులో కేజీ వెండి ధర రూ. 91,700గా నమోదైంది. ఇక మీరు తాజాగా నమోదైన బంగారం ధరలను తెలుసుకునేందుకు, 8955664433కు మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు.