by Suryaa Desk | Fri, Dec 27, 2024, 12:32 PM
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి మృతి పట్ల సంతాపం ప్రకటించి రెండు నిమిషాలు మౌనం పాటించిన నీలం మధు మరియు కాంగ్రెస్ శ్రేణులు..శుక్రవారం పటాన్చెరు నియోజకవర్గం జిన్నారం మండలం కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ వడ్డే కృష్ణ గారు ఇటీవల ప్రమాదవశ్యతు గాయపడగా చికిత్స చేసుకుని కొడకంచి లోని వారి నివాసానికి తిరిగి వచ్చిన విషయం తెలుసుకుని వారి ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి పరామర్శించిన మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను అన్ని విధాలా అండగా ఉంటామని తెలియజేశారు, చికిత్స చేసుకుని వచ్చిన వడ్డే కృష్ణ గారు తొందరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. నీలం మధు మాట్లాడుతూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి మృతి దేశానికి మరియు కాంగ్రెస్ పార్టీకి తీరని లోటు అని ఆయన తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశానికి ఎంతో ఉపయోగ పడ్డాయని గుర్తుచేసుకున్నారు, ఆయన మృతి పట్ల సంతాపం ప్రకటించి నాయకులంతా రెండు నిమిషాలు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి, మాజీ ఎంపీపీ రవీందర్ గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాజు గౌడ్,సీతారాం, నరసింహ, రామకృష్ణ, మాణిక్ రావు,శ్రీనివాస్,మహేష్,శ్రీనివాస్,గణేష్, రాము, బిక్షపతి,వెంకటేశ్,నర్సింలు, ఎల్లయ్య,సురేష్,శ్రీకాంత్,నాయకులు, కార్యకర్తలు,తదితరులు, పాల్గొన్నారు.