by Suryaa Desk | Fri, Dec 27, 2024, 01:22 PM
సంధ్య థియేటర్ ఘటన లో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ కేసు శుక్రవారం నాంపల్లి కోర్టు లో విచారణ జరిగింది. ఈ కేసులో కౌంటర్ ధాఖలు చేసేందుకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ సమయం కోరారు. దీంతో తదుపరి విచారణ వచ్చే సోమవారంకు న్యాయస్థానం వాయిదా వేసింది. చిక్కడ పల్లి పోలీసులు సోమవారం కౌంటర్ ధాఖలు చేయనున్నారు. కాగా రిమాండ్ పొడిగింపుపై అల్లు అర్జున్ మరికొద్ది సేపటిలో వర్చ్యువల్ విధానంలో హాజరు కానున్నారు. కాగా సంధ్య థియేటర్ ఘటనలో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్‌శుక్రవారం నాంపల్లి కోర్టు కు వర్చువల్ లో విధానంలో హాజరవుతారు. అసలు అల్లు అర్జున్ ఈ రోజు స్వయంగా కోర్టు ముందు హాజరవుతారని అనుకున్నారు. అయితే శాంతి భద్రతల నేపథ్యంలో వర్చువల్‌గా హాజరు అవుతారని ఆయన తరఫు న్యాయవాదులు కోర్టును అభ్యర్థించారు. వారి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం వర్చువల్ విధానంలో హాజరయ్యేందుకు అనుమతి ఇచ్చింది. కాగా అల్లు అర్జున్‌కు న్యాయస్థానం విధించిన 14 రోజుల రిమాండ్ ఈరోజుతో పూర్తి కాగా.. వ్యక్తిగతంగా విచారణకు ఆయన హాజరుకావాల్సి ఉంది. ఇదే కేసులో అల్లు అర్జున్‌కు హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ రోజు నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ హాజరై హైకోర్టు బెయిల్ మంజూరు చేసినట్లు ఆయన తెలపాల్సి ఉంది. సెక్యూరిటీ సమస్య కారణంగా ఆయన వర్చువల్‌లో విధానంలో హాజరవుతారు.. కాగా టాలీవుడ్ మీరో అల్లు అర్జున్‌ను చిక్కడపల్లి పోలీసులు ఈనెల 13వ తేదీ (శుక్రవారం) అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ నటించిన పుష్పా -2 సినిమా చూసేందుకు వచ్చి అక్కడ జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో ఇప్పటికే ముగ్గురిని అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. సంధ్యా థియేటర్ యజమానితోపాటు మేనేజర్‌ను అరెస్టు చేశారు. సరైన భద్రతా చర్యలు చేపట్టని సెక్యూరిటీ మేనేజర్‌ను కూడా అరెస్టు చేశారు. ముగ్గురిని అరెస్టు చేసి చిక్కడపల్లి పోలీసులు రిమాండ్‌కు పంపించారు. ఈ ఘటనపై పోలీసులు సంచలన విషయాలు మీడియా ముందుకు తెచ్చిన విషయం తెలిసిందే. పుష్ప-2 ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నిందితుడు, సినీ హీరో అల్లు అర్జున్‌కు తెలంగాణ హైకోర్టు నాలుగు వారాల మధ్యంతర బెయిల్ ప్రసాదించింది. ఈ కేసులో ఆయన అరెస్టయి జైలుకు వెళ్లిన కొద్ది గంటల్లోనే బెయిలు లభించింది. అలాగే ఈ ఘటనలో అరెస్టు అయిన ముగ్గురికి బెయిల్ ఇచ్చింది. సంధ్య థియేటర్ తొక్కిసలాట సంఘటనలో రేవతి అనే మహిళ మృతి చెందగా, ఆమె కుమారుడు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. హత్య చేసే ఉద్దేశంతో దాడి చేయడం, ఉద్దేశ పూర్వకంగా పదునైన ఆయుధాలతో దాడి చేయడం వంటి సెక్షన్లు ప్రస్తుత కేసుకు వర్తించవని హైకోర్టు పేర్కొంది. నిర్లక్ష్యం వల్ల మరణం జరిగిందనుకున్నా ఆ నేరానికి పడే గరిష్ఠ శిక్ష ఐదేళ్లే కాబట్టి బెయిల్‌కు పిటిషనర్ అల్లు అర్జున్ అర్హుడని పేర్కొంది. ఏడేళ్లలోపు జైలుశిక్ష పడే కేసుల్లో అరెస్ట్ అవసరం లేదు కాబట్టి.. ఇది బెయిలబుల్ కేసేనని జస్టిస్ జువ్వాడి శ్రీదేవి ధర్మాసనం పేర్కొంది.