![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 13, 2025, 07:18 PM
ప్రముఖ యూట్యూబర్ భయ్యా సన్నీ యాదవ్‌పై సూర్యపేట పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసి వేల మంది యువకులను బెట్టింగ్ ఊబిలోకి దించడంతో ఈ కేసు నమోదు చేశారు. అయితే ప్రస్తుతం సన్నీ యాదవ్ పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. అతడి కోసం గాలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. కాగా భయ్యా సన్నీయాదవ్‌పై కేసు నమోదు చేసినందుకు ఆర్డీసీ ఎండీ సజ్జనార్ సూర్యపేట ఎస్పీకి ధన్యవాదాలు తెలిపారు.