![]() |
![]() |
by Suryaa Desk | Thu, Mar 13, 2025, 07:28 PM
నారాయణపేట, కొడంగల్, మక్తల్ ఎత్తిపోతల పథకానికి సంబంధించి భూ సేకరణ పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. గురువారం నారాయణపేట కలెక్టరేట్ లో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. మొత్తం 21 గ్రామాలలో 556 ఎకరాల భూమి సేకరించాల్సి వుండగా, 16 గ్రామాలలో భూ సేకరణకు ప్రిలిమినరీ నోటిఫికేషన్ జారీ చేసినట్లు అధికారులు కలెక్టర్ కు వివరించారు. పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ చెప్పారు.